శ్రీ రుక్మిణి సత్యభామ సమేత నూతనాపురి వేణుగోపాల స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది

జనం న్యూస్ / గంభీరావుపేట 02 మే, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కొత్తపెళ్లి గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి శ్రీనివాస్ గౌడ్ మరియు కమిటీ ఆధ్వర్యంలో శ్రీ రుక్మిణి సత్యభామ నూతనాపురి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు తేదీ25/4/26 నుండి02/5/26 వరకు కన్నుల పండుగగా జరిగాయి. అందులో భాగంగా శనివారం రోజు తేదీ02/5/26 రోజున భక్తుల దర్శన నిమిత్తం శ్రీ రుక్మిణి సత్యభామ వేణుగోపాలస్వామిని రథోత్సవం పై అలంకరించి, పురవీధుల గుండా స్వామివారిని మేళ తాళాలతో, చిన్నారుల కోలాటాల మధ్య, డీజే పాటలతో నృత్య ప్రదర్శనలు చేస్తూ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామ ప్రజలు స్వామివారికి మంగళ హారతులు, కట్నకానుకలు సమర్పించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించి, మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో వేణుగోపాల స్వామి గోవింద గోవింద నామ స్మరణతో మారు మ్రోగాయి. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శివసేన రాష్ట్ర నాయకులు, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గణేష్ గౌటే, డిఎస్పి నాగేంద్ర చారి, ఎస్సై అనిల్ కుమార్, గ్రామ సర్పంచ్ బాలరాజు గౌడ్, ఉప సర్పంచ్ ప్రియాంక / శ్రావణ్ యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మరియు కమిటీ సభ్యులు శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా స్థానిక ఎస్సై అనిల్ కుమార్ ముందస్తు జాగ్రత్తలు ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులకు మంచినీటి సౌకర్యం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు వేణుగోపాలస్వామి కరుణ కటాక్షములు వేద పండితులు అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ సింగిల్ విండో చైర్మన్ రాజనర్సింహారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ బాల్ రెడ్డి, ఉప సర్పంచ్ ప్రియాంక, మాజీ ఎంపీపీ వంగ కరుణ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, గ్రామ ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు. ఎందుకుగాను ఆలయ కమిటీ చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు.