
జనం న్యూస్ సెప్టెంబర్ 2 జి మాడుగుల (విలేఖరి కృష్ణబాబు) అల్లూరి సీతారామరాజు జిల్లా జిమాడుగుల మండలం పరిధిలో జిమాడుగుల మండలం మహిళా సమైక్య కార్యాలయంలో శ్రీనిధి రుణాల మంజూరుకు సిబ్బంది నిర్లక్ష్యం కారణమని వెలువడిన వార్తకు జీ మాడుగుల మహిళా సమాఖ్య వెలుగు ఏపీఎం డి.భద్రరావు వివరణ ఇచ్చారు జి మాడుగుల వివో ఏ లో చుట్టు మెట్ట గ్రామానికి చెందిన ఎస్ ఎస్ జి పొదుపు సంఘం సభ్యులు గత నెల అనగా 24/ 6 /2026 న శ్రీనిధి సమృద్ధి పొదుపు డిపాజిట్ 7500 డిపాజిట్ చేయడం వాస్తవమని కొన్ని సాంకేతిక కారణాల వలన వాళ్లకు శ్రీనిధి రుణం మంజూరులో ఆలస్యం జరిగిందని ఆయన తెలిపారు.వెలుగు ఏపీఎం డి.భద్ర రావు మాట్లాడుతూ మండలంలోని పలు మహిళా పొదుపు సంఘాలకు శ్రీనిధి రుణాల మంజూరులో సాంకేతిక లోపాల వల్ల రుణాల మంజూరుకు ఆలస్యం జరుగుతుందని దీనిపై పై అధికారులకు నివేదికలు పంపించామని అవి మెరుగుపడిన వెంటనే శ్రీనిధి రుణాలు మంజూ రైనా సంఘాలకు తెలియపరచి ఏ సంఘాలైతే శ్రీనిధి సమృద్ధి పొదుపు రిజిస్ట్రేషన్ డిపాజిట్ చేసి ఉన్న ఆ సంఘాలకు తెలియపరచి వాళ్లకు సత్వరమే శ్రీనిధి రుణాలు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు గతవారం పత్రికల్లో వచ్చిన వార్తల ను బట్టి ఈ వివరణ చూద్దామని ఆయన పేర్కొన్నారు. కొన్ని వెబ్సైట్లో సాంకేతిక లోపాల కారణాల వలన రుణాలు మంజూరులో ఆలస్యం జరిగిందని ఆయన తెలిపారు. జిమాడుగుల వివో ఏ లో సంఘాలు ఎక్కువగా ఉండటం వలన ఆ సంఘాలను రెండుగా విభజించి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు 58 డ్వాక్రా సంఘాలు జి.మాడుగుల వివోఏ లో ఉన్నాయని అందులో రెండు వివో ఏ సంఘాలుగా విభజించడం జరిగిందని అందువలన ఈ సమస్య తలతిందని దానికి తోడు సాంకేతిక సమస్య ఏర్పడటంతో రుణాల మంజూరుకు ఆలస్యం జరిగిందని జి మాడుగుల వివోఏ సరస్వతి గాంధీ నగరం వివోఏ రాజేశ్వరి అప్పులు చేశామని ఆయన పత్రిక విలేకరీ తో మాట్లాడారు సాంకేతిక లోపం వలన రాజేశ్వరి వివో ఏ సభ్యురాలుకు మొబైల్ నెంబర్ షర్ఫులో రిజిస్ట్రేషన్ అవ్వకపోవడం వలన 27 సంఘాలకు బయోమెట్రిక్ తంబు అవటం లేదని వివోఏ లో ఐడి నెంబర్ చూపించుట లేదని ఆయన తెలిపారు. సేర్ఫు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవ్వగానే ఆయా సంఘాలకు శ్రీనిధి రుణాలు మంజూరు సత్వరం అందిస్తామని ఆయన మీడియా ముఖంగా తెలియపరిచారు.