
జనం న్యూస్ సెప్టెంబర్ 2కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల పరిధిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను జరుపుకున్నారు.ఈ సందర్భంగా కంటే రాకేష్ ఆధ్వర్యంలో జన్మదిన కేక్‌ను కట్ చేసి, జనసేన అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు, అభిమానులు నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో బక్కి అనిత్ కుమార్, పంజాల యశ్వంత్,కూచన శ్రీనివాస్, హరీష్, శీను, శివప్రసాద్, శ్రీకాంత్, సురేష్, మొగిలి, సాయి, విష్ణువర్ధన్, అనిల్, మణికంఠ, తిరుపతి, అరవింద్,జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.