జనం న్యూస్ 01 జులై సంగారెడ్డి జిల్లా స్టాఫర్ సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం పరిధిలోని వట్పల్లీ మండల పరిధిలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే సందర్బంగా నేడు ఆర్. ఎస్ ఫంక్షన్ హాల్ యందు( 9 )మంది వైద్యులకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పి. కిషన్ రావు అధ్యక్షతన, మరియు రీజినల్ చైర్మన్ శ్రీ రాజకుమార్ ముఖ్య అతిథులుగా, పెద్దన్న డిస్టిక్ చైర్మన్ అతిథులుగా ఉండి కార్యక్రమాన్ని నడిపించారు. "బిదాన్ చంద్రరాయి అనే వైద్యులు (వెస్ట్ బెంగాల్ )"1882 లోవారి జన్మదినం కారణంగా అన్నివృత్తుల కంటే వైద్య వృత్తి గొప్పది, రాత్రింబవళ్లు నిస్వార్త సేవా, పెషేంట్ ఎంతటి వ్యాదిగ్రస్థుడైనా వారికి ముట్టి, భరోసా కల్పించి, ప్రాణం ఇచ్చే పవిత్ర కార్యం లో ఉన్న వైద్యులకు సన్మానం నిర్వహించారు. డీసి మొయినొద్దీన్, ట్రెసరర్ మధు, డిగంబర్ రావు, సిద్దేశ్వర్, కచూర్ రావు, వెంకట్ పాటిల్, గోపాల్ రెడ్డి, డిగంబర్ రావు టీచర్, క్లబ్ గౌరవ సభ్యులు పాల్గొన్నారు. సన్మాన గ్రహీతలు. 1) Dr.వైద్య సాగర్ 2) Dr. సౌమ్య 3) Dr.విధాత్రి 4) Dr. శ్వేత 5) Dr. శిల్ప 6) Dr. మహేందర్ 7) Dr. సుభాష్ 8) Dr. సురేష్ 9) Dr.శేఖర్. పి. యస్. టి - లయన్స్ క్లబ్ వట్పల్లి.