జనం న్యూస్/జులై 1/పోలవరం నియోజకవర్గం /రిపోర్టర్ : ఎన్.ఎస్.ఆర్ ఇటీవల పత్రికలలో వేలేరుపాడు కెజిబివి ఎస్.ఓ అరుణజ్యోతి నిర్లక్ష్యానికి హెడ్ కుక్ కె విమల బలి అనే శీర్షికతో వచ్చిన విషయం తెలిసినదే.కోపల విమలకు జరుతున్న అన్యాయం జీవితానికి తిరుగులేని దెబ్బని చరవాణి ద్వారా గోడుని ఆమె జాతీయ మానవ హక్కుల కమీషన్ జిల్లా చైర్మన్ పొట్టా వెంకటేశ్వరరావుకు తెలియజేయడం జరిగిందని స్థానిక మీడియా ప్రతినిధులకు తెలియజేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పై స్థాయిలో ఉన్న వారు తోటి వర్కర్లకు తెలియని విషయాలు తెలియజేసే విధంగా ఉండాలని,కోపల విమల విషయంలో ఎస్.ఓ అరుణజ్యోతి చేసిన తప్పిదమే కళ్ళకద్దినట్లు కనపడుతుందని అన్నారు. కోపల విమల చరవాణి ద్వారా తెలియజేసిందేమిటంటే వేలేరుపాడు ( భూదేవిపేట ) కె.జి.బి.వి పాఠశాలలో 15 సంవత్సరాలు పాటు పని చేస్తున్నానని,2011లో స్కావింజర్ గా నియమితులై 2015 వరకు విధులు నిర్వహించింది వాస్తవమేనని,2016లో ఆనాటి రాష్ట్ర ఎస్.పి.డి బ్రహ్మానందరెడ్డి స్కావింజర్లుగా పనులు చేయవద్దని చెప్పి,2016లో స్కావింజర్ నుండి హెడ్ కుక్ గా మార్చారని,2016 నుండి 2026 పాఠశాల సెలవుల వరకు హెడ్ కుక్ గానే విధులు నిర్వహిస్తూ,హెడ్ కుక్ గానే హాజరు వేయించుకుంటూ,హెడ్ కుక్ గానే జీతాలు పొందుతున్నాని తెలిపారు. ఇక్కడ జరిగిన లోపమేమిటంటే హెడ్ కుక్ గా నియమించిన తర్వాత స్కావింజర్ గా ఉన్న పాత ఆర్డర్ కాఫీని హెడ్ కుక్ గా ఎస్.ఓ అరుణజ్యోతి మార్పు చేసి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసిందని అన్నారు.అంతే కాకుండా నన్ను హెడ్ కుక్ గా నియమితులను చేసి హెడ్ కుక్ గానే పరిగణలోకి తీసుకొని,జీతాలు కూడా హెడ్ కుక్ గానే చేస్తున్నానని,నేను హెడ్ కుక్ గా ఉన్న సమయంలో 2024 సంవత్సరంలో స్కావింజర్ స్థానంలో సోడే విమలను నియమించారని,ఆమె 2024 నుండి 2026 ఫిబ్రవరి చివరి వరకు స్కావింజర్ గా విధులు నిర్వహించి జీతాలు తీసుకుందని, ఇప్పుడు హెడ్ కుక్ అయిన నన్ను స్కావింజర్ గా విధులు నిర్వహించమని ఎస్.ఓ అరుణజ్యోతి ఒత్తిడి చేస్తున్నారని విమల తెలియజేయడం జరిగిందన్నారు.అంతే కాకుండా హెడ్ కుక్ పోస్ట్ నేమో ఖాళీగా ఉన్నట్లు చూపిస్తూ భర్తీ చేయమని జిల్లా కార్యాలయంకి పంపినట్లు తెలిపారు. అటువంటప్పుడు కోపల విమల గాలిలో దీపంలా ఉండాల్సిందేనా అన్న మాదిరిగా కనపడుతుందని అన్నారు.10 సంవత్సరాల పాటు హెడ్ కుక్ విధులు నిర్వహించారు కాబట్టి హెడ్ కుక్ గానే పరిగణలోకి తీసుకోవాలని,ఆర్డర్ కాఫీ మార్చకుండా,తనదైనా శైలిలో ఉద్యోగాలు ఖాళీలు చూపించుకుంటూ,నియామకాలు చేసుకుంటూ పోతున్న ఎస్.ఓ అరుణజ్యోతిపై తగు చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమీషన్ జిల్లా చైర్మన్ పొట్టా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.