వికసిత్ భారత్ – జి రామ్ జి ద్వారా 125 రోజుల పని దినాలు

★జనసేన పార్టీ వేలేరుపాడు మండల అధ్యక్షులు గణేశుల ఆదినారాయణ

జనం న్యూస్/జులై3/పోలవరం నియోజకవర్గం/రిపోర్టర్ : ఎన్.ఎస్.ఆర్ కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ జి రామ్ జి ద్వారా ఉపాధి హామీ శ్రామికులకు 125 రోజులు పని దినాలు కలిపించడం జరుగుతుంది అని జనసేన పార్టీ మండల అధ్యక్షులు గణేషుల ఆదినారాయణ అన్నారు. మండలంలోని అధికారులు మరియు కూటమి నాయకులతో కలిసి పలు గ్రామాల్లో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ పధకం ద్వారా ఉపాధి హామీ శ్రామికులకు 125 రోజులు పని కల్పించాడం, గ్రామ సభలకు ద్వారా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక, నిరుద్యోగా భృతి కోసం మెరుగైన ఏర్పాటు, సమయానికి చెల్లింపులు, ఆలస్య చెల్లింపులకు పరిహారం,సాంకేతిక పరిజ్ఞానం తో శక్తివంతంగా పని చేయడం జరుగుతుంది అని అన్నారు.ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణభివృద్ధి శాఖ మంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పధకం సమర్ధవంతంగా నడుస్తున్నది అని అన్నారు.ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు అయినా దేవిరెడ్డి సుధాకర్, కోటిపల్లి ముత్యాలరావు, కుక్కునురు సత్యనారాయణ జనసేన సోషల్ మీడియా ఇంచార్జి కొవ్వాల క్రాంతికుమార్, ఉపాధి హామీ సిబ్బంది,ఉపాధి శ్రామికులు పాల్గొన్నారు.