జనం న్యూస్ 02 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగాలి నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి సెల్ఫ్ ఎన్నూమరేషన్ కు పెద్ద ఎత్తున ప్రచారం అవసరం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల నాలుగవ తేదీ నుంచి నిర్వహించే రైతు వారము కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరి ధాన్యం కొనుగోలు నీట్ పరీక్ష, ప్రజావాణి, సెన్సస్ తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు గద్వాల ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీసీ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ సెన్సెస్ కు సంబంధించి జిల్లాలో సెల్ఫ్ ఎన్నూమరేషన్ కు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 4వ తేదీ నుంచి డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహణకు ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేశామని రైతులకు సకాలంలో డబ్బులు అందేలా చర్యలు చేపట్టామన్నారు నీట్ పరీక్షకు నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా పకడ్బందీగా నిర్వహించ నున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు ఆర్డీవో శ్రీనివాసరావు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జారీ చేయువారు: డీపీఆర్ఓ జోగులాంబ గద్వాల జిల్లా.