
జనం న్యూస్ సెప్టెంబర్ 3 (ప్రతినిధి రాజు)తెలుగు ప్రజల గుండెల్లో ‘రాజన్న’గా చెరగని ముద్ర వేసుకున్న మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని వజ్రకరూరు మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.పేదలు, రైతులు, విద్యార్థులు, నిరుపేద కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ సాగించిన పాలనను నాయకులు గుర్తు చేసుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదల ప్రాణాలకు భరోసానిచ్చిన ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలతో కోట్లాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. అధికారం కోసం కాకుండా అణగారిన వర్గాల కన్నీళ్లు తుడిచేందుకు ప్రజల మధ్య నడిచిన నాయకుడిగా ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.వైఎస్సార్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని నాయకులు అన్నారు. ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతి కోసం ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవి బాయ్, వైఎస్ఆర్సిపి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జగదీష్, మండల ఉపాధ్యక్షుడు ఉస్మాన్, మాజీ సర్పంచులు మోనాలిసా, కమలమ్మ, అల్లప్ప, వజ్రకరూర్ వైఎస్ఆర్సిపి టౌన్ ప్రెసిడెంట్ రవికాంత్ రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సుశీలమ్మ, నాయకులు రాకెట్ల బాబు, ఎద్దటి రమేష్, రఘుపతి, ఆదినారాయణ,నెట్టికల్లు, మాజీ వార్డ్ మెంబర్ మధుసూదన్, సామా నాయక్, కొనకొండ్ల గోవిందు, వీరభద్ర గౌడ్, రాముల నాయక్, హబీబ్, ప్యాపిలికిష్ట, బీమా తదితర వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు,నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.