మొయినాబాద్ మున్సిపాలిటీ 4వ వార్డ్ బిజెపి కౌన్సిలర్ షాబాద్ కిషన్ హిమాయత్‌నగర్ ప్రజల పోరాటానికి మద్దతు

జనంన్యూస్ 1 జులై 2026 మొయినాబాద్ ప్రతినిధి హిమాయత్ నగర్ 2007లో ఆమోదించబడిన 60 గజాల గృహ స్థల పట్టాలు ఇప్పటికీ అందని ద్రాక్షగా మారాయి. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నిరంతరంగా పోరాడుతున్న ప్రజలకు మద్దతుగా మొయినాబాద్ మున్సిపాలిటీ 4వ వార్డ్ బిజెపి కౌన్సిలర్ షాబాద్ కిషన్ స్వయంగా వచ్చి స్పందించారు. ప్రజల న్యాయమైన హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటం ఇక మౌనంగా ఉండే స్థితి దాటింది. ప్రతి కుటుంబం, ప్రతి యువకుడు, ప్రతి మహిళా అందరూ కలసి పోరాటమే మార్గమని స్పష్టంగా ప్రకటిస్తున్నారు.ఈ పోరాటం ప్రజల హక్కుల కోసం, భవిష్యత్తు తరాల కోసం, న్యాయం సాధించే వరకు కొనసాగుతుంది.