మీ భూమి – మీ హక్కు పట్టదారు పాసుపుస్తకాలు పంపిణీ..

జనం న్యూస్ 3 సెప్టెంబర్ 2026 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా : మండలంలోని రామాపురం గ్రామంలో బుధవారం నాడు మీ భూమి మీ హక్కు పట్టదారు పాస్ పుస్తకం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పద్మావతి పాల్గొని 895 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా రీసర్వే పూర్తయిన గ్రామాలలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు...ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు సుబ్బ లక్ష్మయ్య, వీఆర్వో మౌలాలి, రైతులు వీఆర్ఏలు పాల్గొన్నారు...