జనం న్యూస్ బోధన్ నియోజవర్గం సాలూర మండలం హున్సా గ్రామంలో నూతనంగా నిర్మించిన మహా లక్ష్మీ అమ్మవారి విగ్రహాల ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గ్రామ శివారులో నిర్మిస్తున్న బీరప్ప ఆలయ ప్రాంగణంలో కమ్యూనిటీ హాల్ కొరకు 7 లక్షల రూపాయల మంజూరు కొరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.హున్సా కుమ్మన్ పల్లి దారిలో నిర్మించనున్న బిడ్జ్ కొరకు టెండర్ పూర్తి అయిందని పనులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.హున్సా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పాఠశాల బైపరికేషన్ కొరకు పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి చేర్చగా అందు కొరకు తప్పనిసరిగా తక్షణమే నిర్ణయం తీసుకుంటామని గ్రామస్తులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.బైపలర్ కేషన్ కొరకు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులతో చరవణినిలో ఎమ్మెల్యే మాట్లాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాని,పిసిసి డెలిగేట్ గంగా శంకర్,బోధన్ ఏఎంసీ చైర్మన్ చీల శంకర్,బోధన్,సాలూర మండలాల అధ్యక్షులు నాగేశ్వరరావు,మందర్న రవి,గ్రామ సర్పంచ్ మర్కలు శివకుమార్,ఉపసర్పంచ్ తుడిమే నగేష్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇల్తేపు శంకర్,నరేందర్ రెడ్డి,అల్లె రమేష్,తహసిల్దార్ నవాజ్, ఎంపీడీవో నర్సయ్య, వీడిసి చైర్మన్ మురిగె శంకర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,గ్రామ పెద్దలు,గ్రామస్తులు,భక్తులు పాల్గొన్నారు. ….సాలూర మండల ప్రజలు మెరుగైన వైద్య సేవలు సద్వినియం చేసుకోవాలి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. సాలూరు మండలంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వ సలహాదారులు,బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి అన్నారు.సాలూర మండలం హున్సా గ్రామంలో బోధన్ ఎమ్మెల్యే పల్లె దవాఖానను బుధవారం ప్రారంభించారు.ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు.ఆసుపత్రి నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన గ్రామస్తుడు సంజీవ్ పటేల్ కు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఆసుపత్రిలో గ్రామస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ గంగాశంకర్,రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెల్ బిన్ హందాని, గ్రామ సర్పంచ్ మర్కల్ శివకుమార్,బోధన్ ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, బోధన్ సాలూర మండల అధ్యక్షులు నాగేశ్వరరావు,మందర్న రవి,నరేందర్ రెడ్డి, తహశీల్దార్ నవాజ్,ఎంపీడీవో నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,గ్రామ పెద్దలు,గ్రామస్తులు పాల్గొన్నారు.