మధిర మండలంలో పలు శుభకార్యాలకు హాజరైన మండల కాంగ్రెస్ నాయకులు.

జనం న్యూస్ మధిర మే 2 దోర్నాల కృష్ణ మధిర మండలంలో దెందుకూరు గ్రామానికి చెందిన బొబ్బిళ్ళపాటి ఆశీర్వాదం విజయలక్ష్మి ప్రధమ కుమార్తె ఏఈఓ అమృత మహంత్ ల వివాహ వేడుకకు శ్రీరస్తు ఫంక్షన్ హాల్ నందు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మధిర మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ అదేవిధంగా మండల పరిధిలో జాలిమూడి గ్రామానికి చెందిన బొగ్గుల భాస్కర్ రెడ్డి వరలక్ష్మి దంపతుల కుమార్తె ఇందురెడ్డి రిసెప్షన్ కార్యక్రమానికి జాలిముడి లో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించినారు.
అనంతరం రెడ్డి గార్డెన్ నందు జరుగుచున్న నల్లగట్ల సాయితేజ మానస దేవి ల వివాహ వేడుక హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కర్నాటి రామారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలూరు సత్యనారాయణ రెడ్డి, మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు నిడమానూరు వంశీకృష్ణ, మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ అద్దంకి రవికుమార్, ఫతేపురపు సంగయ్య, మైలవరం చక్రి తదితరులు పాల్గొన్నారు.