మండల బిజెపి అధ్యక్షులు లక్ష్మీనారాయణ జన్మదిన కానుకగా…..ఉచిత వైద్యశిబిరం.

★ 80 మంది వైద్య పరీక్షలకు హాజరుకాగా…21 మంది కీ ఆపరేషన్లకు ఎంపిక.

జనంన్యూస్ జూన్ 02 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) సమాజంలో స్టేటస్ కోసం ఆర్బాటా లు హంగామాలు చేస్తూ లక్షలాది రూపాయలు నిరుపయోగం చేసే ఈ సమాజంలో అందుకు విరుద్ధంగా తన జన్మదినం పేదలకు సహాయ పడితే చాలనుకొని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వందలాది మందికి వైద్య సేవలు అందించాడు గోరంట్ల మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బోయ లక్ష్మీనారాయణ. గోరంట్ల మండలం లోని తమ సొంత పంచాయతీ అయినా పులేరు ప్రభుత్వ స్కూల్ ఆవరణలో తిరుపతికి చెందిన శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉచిత వైద్య శిబిరాన్ని బోయ లక్ష్మీనారాయణ ఏర్పాటు చేశారు. పుల్లేరు పంచాయతీ కేంద్రంలో లక్ష్మీనారాయణ ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి గోరంట్ల మండల టిడిపి అధ్యక్షులు బాలకృష్ణ చౌదరి, రాష్ట్ర హస్త కళల డైరెక్టర్ సోమశేఖర్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కమ్మవారి పల్లి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నరేష్ లు అతిథులుగా హాజరయ్యారు. పులేరు పంచాయతీ ప్రాంత ప్రజల సౌకర్యం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ వైద్య పరీక్షలకు హాజరైన ప్రజలకు మందులు సైతం ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరానికి 80 మంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకో అందులో 20 ఎక్కువ మంది శాస్త్ర చికిత్సలకు ఎంపికైనట్లు డాక్టర్లు తెలిపారు.అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ లక్ష్మీనారాయణ జన్మదిన కానుకగా ఇలాంటి ప్రజా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఒక రాజకీయ పార్టీ నాయకునికి ఇలాంటి ఆలోచనలు రావడం ఆదర్శనీయమని కొనియాడారు.ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికీ లక్ష్మీనారాయణ ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు చంద్ర, రవి మోహన్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ జిల్లా మెంబర్ ఉమాశంకర్, మాజీ సర్పంచ్ ఉత్తమ రెడ్డి, మారెడ్డి పల్లి నరసింహులు, మహేంద్ర, బీసీ సెల్ మండల అధ్యక్షులు వెంకటరమణ యాదవ్, గుంటి పల్లి ఈశ్వరయ్య, పసుపులేటి శ్రీనివాసులు, డిష్ సీన, చంద్రారెడ్డి, సుభహన్,రోహిత్, శ్రీకాంత్, నవీన్, రఘు, ప్రతాప్, లక్ష్మీపతి, లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.