మండలంలోని గ్రామాల్లోఎస్ ఐ ఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించిన తహసిల్దార్ టి. వసంతరావు

జనం న్యూస్ జూలై 2 చిట్యాల మండల ప్రతినిధి శ్రీనివాస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తిరుమలాపూర్ జూకల్ చల్లగరిగ చిట్యాల నవాబ్ పేట ఏలేటి రామయ్య పల్లె గ్రామాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఓటర్లకు మండల తహసిల్దార్ టీ. వసంతరావు అవగాహన సదస్సు కల్పించడం జరిగింది ఈ అవగాహన సదస్సులో తహసిల్దార్ మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి ఒక్క ఓటరు తమ దరఖాస్తు ఫారాలను సరైన విధానంలో పూరించాలని మీ వద్దకు గ్రామాలలోని బూత్ లెవెల్ ఆఫీసర్లు వచ్చినప్పుడు వారికి సరి అయిన సమాచారం అందించి దరఖాస్తు ఫారం ను పూరించడానికి సహకరించాలని అదేవిధంగా గ్రామాల్లో చనిపోయిన వారిని వివాహం జరిగే వెళ్లిపోయిన వారిని గ్రామాలలో లేని వారిని గుర్తించి సమగ్ర విచారణ జరిపి తొలగించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఓటర్లకు దరఖాస్తు ఫారాల పూరింపు విధానంలో అవగాహన కల్పిస్తూ గ్రామాలలోని బూత్ ఆఫీసర్లకు దరఖాస్తు ఫారాలను ఏ విధంగా పూరించాలో వారికి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంల స్థానిక మండల ఎంపీడీవో జయశ్రీ ఆ గ్రామాల సర్పంచులు బూత్ అధికారులు ఓటర్లు మరియు రెవెన్యూ సిబ్బంది శశి కుమార్ గ్రామ పాలన అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచర్ల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు