బీసీ హాస్టల్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

జనం న్యూస్ సెప్టెంబర్ 02 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్ మునగాల మండల కేంద్రంలోని బీసీ బాలురహాస్టల్ నందు కామాటీగా ధులు నిర్వహిస్తున్న బాలాజీ అనేవ్యక్తి మనస్టాపానికి గురై మంగళవారం రాత్రిపురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బీసీ బాలుర హాస్టల్లో గత మూడు సంవత్సరాలుగాకామాటీగావిధులు నిర్వహిస్తున్న బాలాజీ స్థానికులతో ఎంతో స్నేహశీలిగా ఉంటు,గత రెండు రోజులుగా తీవ్ర మనస్థాపానికి గురై అకస్మాత్తుగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం పట్ల హాస్టల్ వార్డెన్ తో ఇటీవల చోటుచేసుకున్న వివాదాలు మరియు ఇతర పరిణామాలే ప్రధాన కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాలాజీ ప్రస్తుతం నల్లగొండ ప్రవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. బాలాజీ ఆత్మహత్యాయత్నం పై ఉన్నత అధికారులు స్పందించి తగు విచారణ చేపట్టి,వాస్తవాలు వెలుగులోకి తేవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.