బిజినపల్లి దివ్యాంగుల పరిరక్షణ నూతన కమిటీ ఎంపిక….

జిల్లా అధ్యక్షులు నారందాస్ శ్రీశైలం….

జనం న్యూస్ జులై 03 ప్రతినిది ఎండీ జహంగీర్ బిజినపల్లి మండలం లో గురువారం నాడు జిల్లా దివ్యాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బిజినపల్లి దివ్యాంగుల కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు జిల్లా అధ్యక్షులు నారం దాస్ శ్రీశైలం,ప్రధాన కార్యదర్శి మోల్గర పరశురాములు తెలిపారు. బిజినాపల్లి మండల దివ్యాంగుల పరిరక్షణ కమిటీ అధ్యక్షునిగా ఎద్దుల వెంకటస్వామి ప్రధాన కార్యదర్శిగా బింగి నరేష్, మండల కార్యదర్శిగా కటికే కృష్ణాజి, ఉపాధ్యక్షులుగా శ్రీదేవి, గుడ్ల నర్వ శ్రీశైలం, కోశాధికారిగా పూర్ణ శంకర్ రామ్మోహన్ కార్యవర్గ సభ్యులుగా ఆంజనేయులు వీరస్వామి,రామ్ రెడ్డి, శేఖర్,వెంకటస్వామి, శేఖర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా అంజిరెడ్డి, బోయాపురం మల్లేష్ లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. అనంతరం నూతన కమిటీ వారిని శాలలతో ఘనంగా సన్మానించారు.దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి,ఆశయ సాధనకు మండల కమిటీ కృషి చేస్తుందని తెలిపారు.