జనం న్యూస్ జులై 1 ( కొయ్యూరు రిపోర్టర్ కృష్ణ ) కొయ్యూరు, రాజవొమ్మంగి, వై రామవరం మూడు మండలాల్లో అర్జున్ రెడ్డి, శోభన్ బాబు, దేవీలాల్ ముగ్గురు ఆర్బీఐ అండర్ లో ఎస్ ఎస్ టి ఆధ్వర్యంలో కౌన్సిలర్స్ గా పనిచేస్తున్నారు. అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం, మంప అరిమెల రాంబాబు, చింతవానిపాలెం ఎం పొట్టయ్య, దొడ్డవరం కృష్ణ, కొత్తపల్లి కొర్ర బంగార్రాజు, బాలరేవులు కిలే లక్ష్మణరావు గ్రామాలకు చెందిన బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ… ఆర్థిక అక్షరాస్యత కేంద్రం సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ఆధ్వర్యంలో అర్జున్ రెడ్డి, శోభన్ బాబు, దేవీలాల్ ముగ్గురు కౌన్సిలర్స్ మా గ్రామాలలో బ్యాంకింగ్ సేవల పట్ల, సామాజిక భద్రతా పథకాలపై, డిజిటల్ బ్యాంకింగ్ లపై, ప్రైవేటు ఆర్థిక సంస్థల మోసాలపై, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలపై,అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్,అన్ క్లెయిమ్ డిపాజిట్లపై తదితర ఆర్థిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారని అన్నారు. దురదృష్టవశాత్తు మా కుటుంబ సభ్యులు అనారోగ్యంతో మరణించారని దీంతో కొయ్యూరు ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ ని సంప్రదించామని, కౌన్సిలర్స్ కొయ్యూరు మండలం గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ జి గణేష్ కు సమాచామివ్వడంతో , పిఎం జెజెబివై 2 లక్షల చొప్పున 10 లక్షల రూపాయలు ఐదుగురికి బీమా నమోదై ఉందని, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ జి గణేష్ మరియు ఎస్ ఎస్ టి ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ అర్జున్ రెడ్డి, శోభన్ బాబు, దేవీలాల్ కలిసి పిఎం జెజెబివై బీమా చెక్ లను ఐదుగురికి అందజేశారని బాధిత కుటుంబ సభ్యులు అరిమెల రాంబాబు, మండిబి పొట్టయ్య, కోపూరు కృష్ణ, కొర్ర బంగార్రాజు, కిలే లక్ష్మణరావు, తెలిపారు. అర్జున్ రెడ్డి, శోభన్ బాబు, దేవీలాల్ ముగ్గురు కౌన్సిలర్స్ ఆర్బీఐ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, మాకు ఆర్థిక భరోసా కల్పించిన సంస్థ డైరెక్టర్ వి ఆంజనేయులు, ప్రాజెక్టు మేనేజర్ వి అశోక్ కుమార్ లకు, మరియు స్టేట్ కో ఆర్డినేటర్ హరిబాబు, జిల్లా కో ఆర్డినేటర్ బాలకృష్ణ లకు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. చెక్ పంపిణీ కార్యక్రమంలో చింతపల్లి యూనియన్ బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్ మండిబి మహేష్ ఉన్నారు.