ప్రశాంతంగాముగిసిన,ఇప్పేరు, నాగిరెడ్డిపల్లి, కలగళ్ల, జయపురము గ్రామాలలోమొహరం వేడుకలు..

జనం న్యూస్, కూడేరుజూన్30, రిపోర్టర్ ముంగా ప్రదీప్ మండల పరిధిలోనిపలు గ్రామాలలో మొహరం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఇప్పేరు, నాగిరెడ్డిపల్లి, కలగళ్ల, జయపురం గ్రామాలలో పీర్లు జలధికి వెళ్ళాయి. నాలుగు గ్రామాలలో పీర్ల పండుగ సందర్భంగా కూడేరు సి ఐ రాజు, వారి సిబ్బంది పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా సిఐ రాజు మాట్లాడుతూ ప్రస్తుతం. ఇప్పటిదాకా పీర్ల పండుగ జరుపుకున్న గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలుచోటుచేసుకోకుండా, ప్రశాంతంగా ముగిసిందని సిఐ రాజు తెలిపారు. మండల ప్రజలు, యువకులు, మత పెద్దలు, నిర్వాహకులు పోలీసులకు పూర్తిగా సహకరించడం వల్ల పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించ గలిగామని పేర్కొన్నారు. మొహరంవేడుకలసందర్భంగా చట్టానికి లోబడి, పరస్పర సామరస్యంతో ప్రజలు పండుగను జరుపుకోవడం శుభపరిణామమనిఅన్నారు. ప్రజల సహకారంతోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పండుగ విజయవంతంగా ముగిసిందని తెలిపారు. అలాగే ప్రజలందరూ ఇదే విధంగా శాంతి భద్రతల పరిరక్షణకు సహకరిస్తూ సామాజిక ఐక్యతను చాటాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బందోబస్తులో పాల్గొన్న, ఏఎస్ఐలు, రామానాయుడు, సంజీవులు, కానిస్టేబులు నరేష్, జగదీష్ ఆయా గ్రామాల పీర్ల పండుగ నిర్వాహకులు పాల్గొన్నారు.. బందోబస్తులో పాల్గొన్న పోలీస్ సిబ్బంది.2. నాగిరెడ్డిపల్లి లో అగ్నిగుండం ప్రవేశం చేసిన కుళ్లాయి స్వామి.