
జనం న్యూస్ సెప్టెంబర్ 2 రిపోర్టర్ ఉపేందర్ నడిగూడెం)గ్రామంలోని ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి కాపాడే బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని నడిగూడెం గ్రామ సర్పంచి దున్నా శ్రీనివాస్ కోరారు. నడిగూడెం నర్సరీ నందు పెంచిన మొక్కలను బుధవారం గ్రామంలో ప్రజలకు అందించారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుకునే బాధ్యత తీసుకొని హరిత గ్రామంగా పేరు వచ్చేందుకు గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యలక ఉమారాణి, వార్డు సభ్యులు నాగారపు సరస్వతి రాము, ఫీల్డ్ అసిస్టెంట్ పద్మ, మాజీ సర్పంచ్ చిల్లంచర్ల సత్యనారాయణ,గ్రామస్తులు పాతకోట్ల శ్రీనివాస్,గుండు వెంకన్న,గుండు శ్రీలేఖ, పాల్గొన్నారు.