పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ సదుపాయం

జనం న్యూస్/సెప్టెంబర్ 03/పోలవరం నియోజకవర్గం /రిపోర్టర్ : సోమరాజు నడపాల ఆర్ & ఆర్ కాలనీలలోని ఫేజ్–1ఎ ఎస్.టి ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ సదుపాయం పోలవరం ప్రాజెక్టు పునరావాసం,పునరావాస ప్యాకేజీలో భాగంగా చింతూరు డివిజన్ పరిధిలోని బైరవపట్నం, కాపవరం, నర్సింగపేట, ఎర్రబోరు, రాయనపేట మరియు కన్నాయిగూడెం ఫేజ్–1ఎ ఆర్&ఆర్ కాలనీలలో పునరావాస గృహాలు పొందిన ఫేజ్–1ఎ ఎస్టీ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల (పిడిఎఫ్ఎస్ )కు పీఎం సూర్య ఘర్ – ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా సౌర విద్యుత్ సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారి, ఆర్ ఆర్ అధికారి,ఐ.టి.డి.ఎ చింతూరు తెలిపారు.ఈ ఆరు ఆర్&ఆర్ కాలనీలలో ప్రభుత్వం నిర్మించి అందజేసిన పునరావాస గృహాలపై సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం ద్వారా అర్హులైన కుటుంబాలకు విద్యుత్ ఖర్చు భారాన్ని తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.అర్హత కలిగిన ఎస్టీ పిడిఎఫ్ లకు ప్రత్యేక ప్రయోజనం ఆర్&ఆర్ కాలనీలలో నివసిస్తున్న ఎస్టీ వర్గానికి చెందిన, నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం ఉన్న అర్హులైన పిడిఎఫ్ లకు పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ ప్యానెళ్లను ఉచితంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.దీంతో అర్హులైన ఎస్టీ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలు సౌర విద్యుత్‌ను వినియోగించుకోవడంతో పాటు భవిష్యత్తులో విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.సమర్పించాల్సిన పత్రాలుపథకం ద్వారా ప్రయోజనం పొందదలచిన అర్హులైన ఎస్టీ పిడిఎఫ్ లు కింది పత్రాలను సమర్పించాలి:1. సంబంధిత పిడిఎఫ్ ఆధార్ కార్డు జిరాక్స్2. పిడిఎఫ్ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా వివరాలు / బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్3. సంబంధిత పిడిఎఫ్ మొబైల్ నంబర్4.ఆర్ ఆర్ కాలనీలో కేటాయించిన ఇంటి ప్లాట్ నంబర్5. కేటాయించిన ప్లాట్ నంబర్‌ను పేర్కొంటూ పిడిఎఫ్ సంతకం చేసిన సమ్మతి పత్రం (కాన్సెంట్ లెటర్ )ఆధార్, బ్యాంకు ఖాతా మరియు మొబైల్ నంబర్ వివరాలు సరిగ్గా ఉండేలా పిడిఎఫ్ లు నిర్ధారించుకోవాలని సూచించారు.దరఖాస్తులు ఎక్కడ సమర్పించాలి?చింతూరు డివిజన్ పరిధిలోని బైరవపట్నం, కాపవరం, నర్సింగపేట, ఎర్రబోరు, రాయనపేట మరియు కన్నాయిగూడెం ఫేజ్–1ఎ ఆర్&ఆర్ కాలనీలలో పునరావాస గృహాలు పొందిన సంబంధిత ఎస్టీ పిడిఎఫ్ లు తమ దరఖాస్తులను అవసరమైన పత్రాలతో కలిసి వీఆర్ పురం మరియు కూనవరం తహసీల్దార్ కార్యాలయాల్లో మాత్రమే సమర్పించాలని తెలిపారు.అర్హులైన పిడిఎఫ్ లు తమకు కేటాయించిన ఆర్&ఆర్ గృహానికి సంబంధించిన ప్లాట్ నంబర్‌ను తప్పనిసరిగా కాన్సెంట్ లెటర్ లో పేర్కొని, సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు.ఎస్టీ పిడిఎఫ్ లకు విజ్ఞప్తిపోలవరం ప్రాజెక్టు పునరావాస ప్రక్రియలో భాగంగా పై ఆరు ఫేజ్–1ఎ ఆర్&ఆర్ కాలనీలలో గృహాలు పొందిన ఎస్టీ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలు ఈ సౌర విద్యుత్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రాజెక్ట్ అధికారి ఆర్&ఆర్ అధికారి,ఐ.టి.డి.ఎ చింతూరు కోరారు.ముఖ్యంగా నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం ఉన్న అర్హులైన ఎస్టీ పిడిఎఫ్ లు అవసరమైన పత్రాలను సమర్పించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.కాబట్టి, బైరవపట్నం, కాపవరం, నర్సింగపేట, ఎర్రబోరు, రాయనపేట మరియు కన్నాయిగూడెం ఫేజ్–1ఎ ఆర్&ఆర్ కాలనీలలో నివసిస్తున్న అర్హులైన ఎస్టీ పిడిఎఫ్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అవసరమైన పత్రాలతో వీఆర్ పురం మరియు కూనవరం తహసీల్దార్ కార్యాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ప్రాజెక్ట్ అధికారి ఆర్&ఆర్ అధికారి,ఐ.టి.డి.ఎ చింతూరు కోరారు.