పేదల సంక్షేమానికి వైఎస్సార్ పాలనే ఆదర్శం

నల్లగొండలో మహానేత వైఎస్సార్‌కు 17వ వర్ధంతి ఘన నివాళులు

జనం న్యూస్ సెప్టెంబర్ 3 ( కొయ్యూరు రిపోర్టర్ సూపర్ స్టార్ కృష్ణ )అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సేవలు చిరస్మరణీయమని వైసీపీ కొయ్యూరు మండల అధ్యక్షులు బిడిజన అప్పారావు అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కొయ్యూరు మండలం నల్లగొండ గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి వైసీపీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. బిడిజన అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా బిడిజన అప్పారావు మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ అందించిన పాలన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్ల వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలకు ఆయన అండగా నిలిచారని కొనియాడారు. రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమానికి వైఎస్సార్ చేసిన కృషి మరువలేనిదన్నారు.కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం అచ్చుత్, ఆర్టీఐ విభాగం నీలపు సూరిబాబు, రాష్ట్ర మహిళా విభాగం సభ్యురాలు జైతి రాజులమ్మ, జిల్లా సభ్యులు పొట్టిక పోతురాజు, సుమర్ల సూరిబాబు, మాజీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు ముసిలి నాయుడు, మండల కార్యదర్శులు పెట్ల గాంధీ, వార నూకరాజు (పండు), మాజీ సర్పంచ్‌లు బాలరాజు, శోభన్, చంద్రరావు, పెంటమ్మ, సావిత్రి, రాజకుమారి, పల్లి చిన్నబ్బాయి, సీనియర్ నాయకులు ఉల్లి రాంమూర్తి, వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.