పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది…

జనం న్యూస్ మే3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేని కోన పింఛన్ల పంపిణీలో మాజీ మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్… నాగిడి నాగేశ్వరరావు పేద ప్రజల కళ్ళల్లో ఆనందం, వారి అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని వ్యాఖ్యానించారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడి వరం నియోజకవర్గం కాట్రేని కోన లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నాగిడి నాగేశ్వరరావు పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా తానే పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా నాగిడి నాగేశ్వరరావు మాట్లాడుతూ సంక్షేమానికి, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధావ్యాఖ్యాని ఇస్తుంద న్నారు ప్రతి నెల పింఛన్ అందిస్తూ పేదల జీవితాలకు భద్రత కల్పిస్తున్నామని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలోరాష్ట్ర ఆక్వా బోర్డ్ డైరెక్టర్ విత్తనాల శ్రీనివాసరావు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, నీటి సంఘం అధ్యక్షులు వాసంశెట్టి రాజేష్ రావు , జంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.