పేదలకు వరం సీఎం సహాయనిధి… ఎమ్మెల్యే బుడ్డా…

జనం న్యూస్ 2 మే 2026 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం,నంద్యాల జిల్లా : శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్వగ్రామమైన వేల్పనూరు తన నివాసంలో బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.. ఏ కోడూరు గ్రామానికి చెందిన బాధితులకు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వడ్డు మధు సుధాన్ రెడ్డి చేతులమీదుగా ఏ కోడూరు గ్రామానికి చెందిన కరిమొద్దల రామిరెడ్డికి 37,900/, చికోండు వంశీధరకి 37114/, షేక్ కొట్టలా సలీం భాష కు 40000/రూపాయల సీఎం సహాయక నిధి చెక్కుల ను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్నారని, అనారోగ్యంతో బాధపడేవారు ఆసుపత్రిలోకి వెళ్లి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిది అందిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని,పేదలకు సహాయం అందిస్తూ ప్రజలను ఆదుకుంటున్నారని ఆయన తెలిపారు. గ్రామానికి చెందిన బాధితులు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి, వడ్డు మధుసూదన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.