జనం న్యూస్ రిపోర్టర్ జులై 3 ( కొయ్యూరు రిపోర్టర్ కృష్ణ ) ఒకప్పుడు ఆకలితో అలమటించిన పేదలకు కడుపునిండా అన్నం పెట్టిన పథకం ఉపాధి హామీ పథకం అని ఈరోజు దాని పని దినాలు పెంచి ఇచ్చే డబ్బుల్ని కూడా డబల్ చేసి దానికి కొత్త రూపాన్ని ఇచ్చారని తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మార్పులు చేర్పులు చేసి నూతనంగా విబిజి రాంజీ(వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆ జీవికా మిషన్) గా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా గురువారం ప్రారంభించారు. పాడేరులో కలెక్టర్ టి నిశాంతి తో కలిసి గిడ్డి ఈశ్వరి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఆకలితో అలమటిస్తున్న వారికి ఉపాధి హామీ పథకం ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఈ పథకం ప్రస్తుత నరేంద్ర మోడీ పేదలకు మరింత చేరువ కావాలని వారికి మరింతగా ఉపయోగపడాలని ఉద్దేశంతో వంద రోజులు ఉన్న పని దినాలను 125 రోజులకు పెంచారని తెలిపారు. ఇది మాత్రమే కాకుండా రూ.175 రూపాయలు వచ్చే వేతనాన్ని రూ.315 లకు పెంచిందన్నారు. ఇది పేదలకు ఎంతగానో కలిసి వచ్చినటువంటి అంశం అన్నారు . వాళ్ళకి మేలు జరిగే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ మార్పులు చేసి దీనికి వి బి జి రాంజీ గా నామకరణ చేసిందన్నారు. ఈ పథకం వలన గతం కంటే ఎక్కువగా పేదలకు మేలు జరిగగే అవకాశం ఉందన్నారు. రోజంతా పనిచేసిన రూ 275 రూపాయలతో సరిపెట్టాల్సి వచ్చేదని ఈరోజు 315 రూపాయలు వి బి జి రామ్ జి ద్వారా ఉపాధి కూలీలు పొందబోతున్నారన్నారు. గతంలో వంద రోజులు మాత్రమే కల్పించే వారిని ఇకనుంచి 125 రోజులు పని చెప్పబోతున్నారన్నారు. ఇది పేదల పక్షపాత ప్రభుత్వం అని చెప్పేందుకు ఇదొక ఉదాహరణగా పేర్కొన్నారు. ఈరోజు మన పొలాలకు కాలువల తవ్వాలన్నా మన పొలాలకు నీరు అందించే చెరువులకు లోతు పెంచాలన్నా భారీ వ్యయంతో కూడుకున్నదని దానిని పూర్తిగా ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వమే చేస్తుందని తెలిపారు. ఇది మాత్రమే కాకుండా మన పని మనం చేసుకున్నందుకు మనకే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని ఎంత గొప్ప పథకం ఎక్కడ ఉండదన్నారు.