పెద్ద శివనూర్ గ్రామంలో ఐకెపి సెంటర్ ప్రారంభం

★అన్నం ఆంజనేయులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో

జనం న్యూస్2.5.2026 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు, మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూరులో ఐకెపి సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సీఈవో నాగేందర్. సీఈఓ రాణి ఆధ్వర్యంలో ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం కల్పించిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు ముఖ్యంగా సన్న రకం వడ్లకు ప్రభుత్వం క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ అందిస్తుందని ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సురేందర్ ఎల్లం.శంకర్.గణేష్ రమేష్ ఆగమయ్య వెంకటేష్. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.