“న్యాయవాదుల ప్రొటెక్ట్ యాక్ట్” అమలు చేయాలి.

జనం న్యూస్ సెప్టెంబర్ 2 కోటబొమ్మాళి మండలం :సమాజంలో న్యాయవాదుల పై జరుగుతున్న దాడుల నిర్మూలన కోసం "న్యాయవాదుల ప్రొటెక్ట్ యాక్ట్" అమలు చేయాలని స్థానిక న్యాయవాదుల బారు అసోసియేషన్ అధ్యక్షుడు లఖినేని శ్రీనివాసులు అధ్యక్షతన బుధవారం నాడు కోర్టు విధులకు బహిష్కరిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడకక్కడ న్యాయవాదుల పై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తామునేడు నిధులు బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఇటీవల కాలంలో ఒక న్యాయవాది తరపు పార్టీ కేసు గెలవడం జరిగితే, అపోజిషన్ న్యాయవాది పై దాడి చేయడం పరిపాటి అయిందని, ఈ విధానాన్ని రూపుమాపాలని వారు తెలిపారు. దీని కోసమే "న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్" అమల్లోకి తేవాలని వారి కోరారు. ఈ యాక్ట్ పక్క రాష్ట్రాల్లో అమలు జరుగుతుందని ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే అమలు కావడం లేదన్నారు. ఇప్పటికైనా ఈ యాక్ట్ ను అమలు చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని వారు ఉన్నత న్యాయస్థానాలను కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పూజారి వాసుదేవరావు, దుంపల నరసింహమూర్తి, పంచి రెడ్డి అర్జున్ రావు, పల్లి వాసుదేవరావు, వెలమల అప్పలనాయుడు, ఎండ వెంకట్రావు, చింతాడ వెంకటరావు, కవిటి మన్మధరావు, ఉప్పాడ తిరుమలరావు, బమ్మిడి జీవన్, వాన నేతాజీ తదితరులు పాల్గొన్నారు.