జనం న్యూస్ 3 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్. ఆలేరు పట్టణంలోని ఇమ్మిడి గార్డెన్స్‌లో శనివారం రోజున ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆలేరు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షే మాన్ని ముఖ్యంగా భావించి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రతి అర్హులైన వ్యక్తికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పాల్గొన్నవారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మహిళా కార్పొరేట్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.