నిండు జీవితానికి రెండే రెండు చుక్కలు గజ్జెహళ్లిలో ఘనంగా పోలియో చుక్కల కార్యక్రమం

జనం న్యూస్ హొళగుంద: (జూన్ 28) రిపోర్టర్ కర్నూల్ జిల్లా ఇంచార్జి : మండల పరిధిలోని గజ్జెహళ్లి గ్రామంలో "చిన్న చుక్క - జీవితాంతం రక్షణ" అనే నినాదంతో గజ్జెహళ్లి గ్రామంలో పోలియో చుక్కల కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. గజ్జెహళ్లి గ్రామంలో శ్రీ పోతులింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక క్యాంపులో 0 నుండి 5 సంవత్సరాల లోపుచిన్నారులందరికీ ఉచితంగా పోలియో టీకా చుక్కలు వేశారు. ఆరోగ్య సిబ్బంది సేవలు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏ.ఎన్.ఎం మీనాక్షిగారు పిల్లలకు స్వయంగా చుక్కలు వేశారు. ఆశా వర్కర్ గంగమ్మ, అంగన్వాడీ టీచర్లు కె.సి. సావిత్రమ్మ, విమలమ్మతదితరులు సహకరించి, పిల్లల వివరాలు నమోదు చేస్తూ, తల్లిదండ్రులకు పోలియో ప్రాముఖ్యతను వివరించారు. ఏ.ఎన్.ఎం మీనాక్షి మాట్లాడుతూ. "పోలియో వ్యాధి రాకుండా ఉండాలంటే ప్రతి చిన్నారికి ఈ రెండు చుక్కలు తప్పనిసరి. గజ్జెహళ్లి గ్రామాన్ని 100% పోలియో రహితంగా చేయడమే మా లక్ష్యం" అని తెలిపారు.