జనం న్యూస్ :02/05/2026, నంద్యాల టౌన్ రిపోర్టర్ కోనేటి వెంకటేశ్వర్లు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం వారు నాటు సారా నిర్మూలన లో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నాటు సారా నిర్మూలన మీద ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన "నవోదయం 2.0" కి సంబంధించి నాటు సారాయి పై పాణ్యం చెంచు కాలనీ లో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.కార్యక్రమానికి రాజశ్రీ నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరాన్ ఐపీఎస్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా గ్రామస్థులతో సాన్నిహిత్యం పెంపొందించడం మరియు ముఖ్యమైన సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడం మరియు అదేవిధంగా ఈ క్రింద తెపిన అంశాలమీద అవగాహన కల్పిచడమైంది. a. నాటు సారాయి తయారీ, వినియోగం మరియు సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం మరియు మద్యం విరమన వైపు ప్రజలను ప్రోత్సహించడం. b. బాలల సంక్షేమం మరియు రక్షణ, బాల కార్మికత్వం మరియు బాల్య వివాహాలను నివారించడం, అలాగే “మంచి స్పర్శ - చెడు స్పర్శ” గురించి పిల్లలకు అవగాహన కల్పించడం. c. యువత అభివృద్ధి యువతను శక్తివంతం చేయడానికి వివిధ కార్య క్రమాలు, వేసవి శిక్షణలు (సమ్మర్ కోర్సెస్ ), ఉద్యోగ మేళాల్లో పాల్గొనడం ద్వారా అవకాశాలు కల్పించడం.
అదే విధంగా సైబర్ క్రైమ్ మీద, రోడ్ భద్రతా నియమాల మరియు మత్తు పదార్థాల మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఎస్ ఐ నరేంద్ర కుమార్ రెడ్డి, ఎక్సస్ డిప్ట్ సంబంధించిన సీఐ కృష్ణ మూర్తి, ఎస్ ఐ శివ ప్రసాద్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఆర్ ఐ మధు, స్కిల్ డెవలప్మెంట్ డిప్ట్ అశోక్ కుమార్ లు హాజరు అయ్యారు.