నర్స్ శిరీషకు కొవ్వొత్తులతో ఘన నివాళి

జనం న్యూస్ టేకులపల్లి సెప్టెంబర్ 2: టేకులపల్లి మండల కేంద్రంలో ఊకె శిరీష అత్యాచారం చేసి హత్య చేసిన సైన ఉల్ల ఖాన్ నీ ఉరితీయాలని ఆదివాసి సంఘాలు ప్రజా సంఘాలు ముక్కకంఠంతో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించినారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కల్తి సత్యనారాయణ
ముఖ్య అతిథులుగా చిమల సత్యనారాయణ మాట్లాడుతూభద్రాద్రి కొత్తగూడెం జిల్లా,ములకలపల్లి మండలం, చవిటిగూడెం గ్రామ ఆదివాసీ బిడ్డ శీరీష మృతి ఘటన అత్యంత విషాదకరము ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాo... ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం సేవలందించే నర్సు శీరీష ప్రాణాలు కోల్పోవడం ఆదివాసీ సమాజాన్ని కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు శీరీష మృతికి కారణమైన సానద్ ఉల్లా ఖాన్‌ పై వచ్చిన ఆరోపణలపై పోలీస్ శాఖ ఎలాంటి పక్షపాతం లేకుండా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రతి ఆధారాన్ని సేకరించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని దర్యాప్తులో నేరం రుజువైతే ఉరి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని.శీరీష కుటుంబం కోల్పోయింది కేవలం ఒక కుటుంబ సభ్యురాలిని కాదు సమాజానికి సేవ చేసే ఒక ప్రాణాన్ని.
ఈ విషాద ఘటనపై ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుంది బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు శిరీష కుటుంబ సభ్యుల తరఫున న్యాయపోరాటం చేస్తాం.మహిళల భద్రతపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి...మహిళలు, ముఖ్యంగా నర్సులు రాత్రి వేళల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, శీరీష కుటుంబానికి తక్షణ న్యాయం, తగిన పరిహారం, పూర్తి రక్షణ కల్పించాలిని
శీరీష కు న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామని, శిరీష కుటుంబానికి ఎక్స్ గ్రేస్ కోటి రూపాయలు వారి కుటుంబానికి ఒక ఉద్యోగం,ఐదు ఎకరాల భూమి, ఇంటి నిర్మాణం చేసి ప్రభుత్వం మే ఇవ్వాలని కోరడమైనది. ఈ కార్యక్రమానికి నాయకులు సనప కోటేశ్వరరావు, ఈసం శివ, దుర్గాపు వీరభద్రం,మోకల అంజయ్య, బోడ బాలు, బొమ్మల ప్రసాదు, ఈసం శ్రీనివాసరావు విసాల రవి మహిళలు గోగ్గల వనిత దుగ్గారపు లావణ్య, కోరం నాగమణి తదితరులు పాల్గొన్నారు