దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నివాళులు.

నివాళులర్పించిన పీర్జాదిగూడ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు: బండి శ్రీరాములు గౌడ్

జనం న్యూస్ (మేడిపల్లి మండలం) సెప్టెంబర్ 03:బోడుప్పల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ 10-వ డివిజన్ అధ్యక్షుడు బండి శ్రీరాములు గౌడ్ ఆధ్వర్యంలో పీర్జాదిగూడ పరిధిలోని ఉప్పల్ బస్ డిపో వద్ద దివంగత నేత గౌరవ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో డిసీసీ జనరల్ సెక్రెటరీ ఏనుగు జలంధర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షులు వంగేటి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు జంగా చారి , మోహన్ గారు పవన్ గారు ఎండి మజార్, సోమయ్య ,మైనారిటీ అధ్యక్షుడు కరీం కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తులో పాల్గొనడం జరిగింది.