దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను మండలంలోఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జనం న్యూస్ సెప్టెంబర్ 2 చిట్యాల మండల ప్రతినిధి జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలో దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వ వర్ధంతి వేడుకలను మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దెబ్బేట అనిల్ పాల్గొని రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం దెబ్బేట అనిల్ మాట్లాడుతూ నిరుపేద ప్రజల సంక్షేమమే మన లక్ష్యం అనే మార్గాన్ని ముందుకు తీసుకెళ్లిన వైయస్సార్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదలు రైతులు మహిళలు విద్యార్థులు వృద్ధులు మరియు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు రైతుల కోసం రైతు భరోసా విద్యార్థుల కోసం అమ్మబడి విద్యా దీవెన వసతి దీవెన పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ మహిళల కోసం ఆసరా చేయుత వృద్ధాప్య పెన్షన్లను కానుకగా పేదల ఇళ్లకు ఇందిరమ్మ ఇల్లు వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు నేరుగా అందేలా చేయడం జరిగింది ప్రజల సమస్యలు పరిష్కరించడం ముఖ్యమని పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడం కోసం అనేక సంక్షేమ పథకాలు అందించి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా రాజశేఖర్ రెడ్డి నిలిచారని దెబ్బేట అనిల్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా వైస్ ప్రెసిడెంట్ పింగిలి జ్యోతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య జిల్లా కార్యదర్శి చిలుకల రాయకుమురు సర్పంచులు కాసం మాధవి రాజిరెడ్డి పార్లపల్లి రవి కుడారి ఓదెలు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అల్లకొండ కుమార్ మాజీ సర్పంచులు కొక్కుల సదానందం టౌన్ అధ్యక్షులు గంగాధర్ రవి మాజీ ఎంపిటిసి కట్కూరు పద్మా నరేందర్ గడ్డం కొమరయ్య బుర్ర లక్ష్మణ్ గౌడ్ క్యాతం మార్కండేయ పింగిలి సతీష్ రెడ్డి ఆకుల రవీందర్ కుర్రి మైసయ్య సరికొమ్ముల సదయ్య గుర్రపు నరసయ్య సర్వ శరత్ కుమార్ వేముల రాజకుమార్ నేరెళ్ల రవి తదితరులు పాల్గొన్నారు