తెలంగాణ రాష్ట్ర వార్డు సభ్యుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి.

★వార్డు సభ్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అందే బీరన్న, అధ్యక్షులు అతికం రాజశేఖర్ గౌడ్

జనం న్యూస్: జూన్ 30 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వార్డు సభ్యుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వార్డు సభ్యుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అందే బీరన్న ,అతికం రాజశేఖర్ గౌడ్ హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలలో అవలంబించిన విధంగా గౌరవ వేతనం ఇవ్వాలని, వార్డు సభ్యులకు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ వేతనం 3000 వేలు ఇవ్వాలని ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్లు 25 లక్ష లు చనిపోయిన వార్డు సభ్యులకు నష్టపరిహారం 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధికి నిరంతరం ఎంతో గాను కృషి చేస్తున్నారని ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుముల నవీన్ కుమార్ , రాష్ట్ర కార్యదర్శి దూపం అంజనేయులు, సందగిరి వెంకటేష్, రాష్ట్రాధికార ప్రతినిధి నాగుల సాంబయ్య గౌడ్ , కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మూల కరుణాకర్ గౌడ్,రాష్ట్ర నాయకులు గంగధర గంగజమున వెంకటరమణ, కామెర తిరుమల తదితరులు పాల్గొన్నారు.