
జనం న్యూస్/ గంభీరావుపేట సెప్టెంబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభరాపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గంభీరావుపేటలో టాస్క్ అండ్ కెరీర్ గైడ్ అండ్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ జె శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయలక్ష్మి అధ్యక్షతన కళాశాలలో రెండు రోజుల శిక్షణ లో భాగంగా మొదటి సంవత్సరం లో చేరిన విద్యార్థులకు రిసోర్స్ పర్సన్ గా టాస్క్ కరీంనగర్ బ్రాంచ్ రిలేషన్ మేనేజర్ హాజరైనారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రెండు రోజుల ప్రోగ్రాంని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్(AI), కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ భాష పైన పట్టు సాధించాలని, ప్రస్తుత డిజిటల్ టెక్నాలజీ కి అనుగుణంగా మార్చుకొని విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా కళాశాలలో విద్యార్థులకు అకాడమిక్ తో పాటు టాస్క్ పైన ఏ కార్యక్రమాన్నైనా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ప్రతి సంవత్సరం విద్యార్థులకు టాస్క్ పైన ఐదు నుంచి ఆరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నప్పుడు మాత్రమే జాబ్ పొందడం ఈజీ అవుతుంది అని తెలిపారు హాజరైన రిసోర్స్ పర్సన్ గంగా ప్రసాద్ మాట్లాడుతూ టాస్క్ లో జాయిన్ అయిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని, కళాశాలలో చదువుతున్నప్పుడే కాకుండా డిగ్రీ పూర్తి అయిన తర్వాత కూడా టాస్క్ విద్యార్థులకు బయట ఉద్యోగాలకు కూడా తగిన ప్రాధాన్యత ఉంటుందనీ, 21st సెంచరీ ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, జాబ్ ఓరియెంటెడ్ స్కిల్స్, క్యాంపస్ టు కార్పోరేట్,ప్రైడ్ మహీంద్రా, ఎంటర్ప్రెనుర్షిప్,సాఫ్ట్ స్కిల్ల్స్,ఎంప్లాయబుల్ స్కిల్ల్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కుడా టాస్క్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన పొందుతారని తెలిపారు. టాస్క్ కోఆర్డినేటర్ డాక్టర్ జె శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ డీగ్రీ ఒక క్వాలిఫికేషన్ సరిపోదని డిగ్రీ తో పాటు టాస్క్ లో చెప్పే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే ఉద్యోగాలు పొందడం ఈజీ అవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ప్రభాకర్, పాక ధర్మపురి,డాక్టర్ ఆంజనేయులు, వి. వాణి, డాక్టర్ అడివిష్ణు, డాక్టర్ K. వి. బిక్షమయ్య, మనోహర్,సుచరణ్, కృష్ణ ప్రసాద్, మహేష్,శంకర్,దీపిక, భార్గవి,ఆకల్య తదితరులు పాలుగోన్నారు.