జనం న్యూస్ / గంభీరావుపేట 02 మే, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జామా మసీద్ కమర్షియల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు 90 లక్షల నిధులతో భూమి పూజ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్స్ బోర్డ్ నిధుల 50 లక్షల నుండి కమర్షియల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నట్లు ఈ నిధులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తోపాటు పాలకవర్గ సభ్యులు మైనార్టీ నాయకులు మైనార్టీ మత పెద్దలు,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.