జనం న్యూస్‌కు స్పందన…

గుంతలను పూడ్చిన మున్సిపల్‌ అధికారులు

జనం న్యూస్ సెప్టెంబర్ 2 రామకృష్ణాపూర్..స్పీడ్‌ బ్రేకర్ల, గుంతల అనే కథనానికి మున్సిపల్‌ అధికారులు స్పందించారు. బుధవారం జనం న్యూస్‌ లో ప్రచురితమైన కథనానికి మున్సిపల్‌ అధికారి ఏఈ ఆశ్రిత్‌ స్పందించి బుధవారం మధ్యాహ్నా సమయంలో గుంతలను వెట్‌మిక్స్‌తో నింపారు. ఇంత త్వరగా స్పందించి సమస్యను తీర్చినందుకు రామకృష్ణాపూర్‌ పట్టణ ప్రజలు హార్షం వ్యక్తం చేశారు.