ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి

జనం న్యూస్ కూడేరు సెప్టెంబర్ 2 అనంతపురం జిల్లా ఇన్చార్జ్ ఉరవకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైసీపీ సమన్వయకర్త వై. విశ్వేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యార్థి విభాగం యువజన నాయకులు వై.ప్రణయ్ రెడ్డి సూచన మేరకు వైసిపి మండల నాయకులు,పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ బుధవారం రోజున ఉదయం 9 గంటలకు కూడేరు మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సీపీ నాయకులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్దకు చేరుకుని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాదయాత్ర చేసి రైతుల ప్రజల కష్టనష్టాలను తెలుసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వెంటనే దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధివైపు పరుగులు పెట్టించి రైతులకు ఉచిత కరెంటును అందించి మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ప్రజలందరి లోనూ గుర్తిండిపోయిన నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వారన్నారు. నిరుపేద ప్రజల కోసం ఉచిత వైద్యాన్ని అందించి పేద ప్రజల ప్రాణా లను కాపాడిన నాయకుడని అలాగే పేద విద్యార్థులకు పిజురియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి ఉచిత విద్యను అందించి మహా గొప్ప నేత అని నాయకులన్నారు. అలాగే రాష్ట్రంలో రైతులు వ్యవసాయం కోసం అప్పులో కూరుకుపోయిన రైతులందరికీ రుణమాఫీ ని అందించి రైతులను ఆదుకున్న మహా గొప్ప నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వారన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించి రాష్ట్ర ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న గుర్తుండిపోయిన నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి పురస్కరించుకుని వైఎస్ఆర్సిపి నాయకులు కూడేరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహం వద్దకు పెద్ద ఎత్తున హాజరై ఘన నివాలని అర్పించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ వైయస్సార్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తు హాజరయ్యారు.