కొయ్యూరు ఏకలవ్య పాఠశాలలో 12 గెస్ట్ టీచర్ల పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు.

జనం న్యూస్ జూలై 3 ( కొయ్యో రిపోర్టర్ సూపర్ స్టార్ కృష్ణ ) అల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలోని బాలారం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఖాళీగా ఉన్న 12 గెస్ట్ టీచర్ల పోస్టుల భర్తీకి ఈ నెల 6వ తేదీన వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ప్రిన్సిపల్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం పీజీటీ కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, గణితం, జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్, తెలుగు సబ్జెక్టులతో పాటు ఆర్ట్, మ్యూజిక్ టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 6న డుంబ్రిగుడ ఏకలవ్య మోడల్ స్కూల్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలకు తమ ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లతో నేరుగా హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందుగానే ఇంటర్వ్యూ వేదికకు చేరుకోవాలని ప్రిన్సిపల్ తెలిపారు.
ఈ అవకాశాన్ని అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.