కాంగ్రెస్ ప్రభుత్వన్ని గద్దె దింపుడు ఖాయం.

పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి

జనం న్యూస్ సెప్టెంబర్ 3, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కేటీఆర్ పిలుపు మేరకు పరిగి పట్టణంలో 420 హామీలకు, 420 మీటర్ల భారీ ఫ్లెక్సీ ప్రదర్శనలో, బి ఆర్ ఎస్ పార్టీ సమరబేరిలో, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజుల దగా పాలనా పైన, అధికారంలోకి రావాలని ప్రజలకు అమలు కానీ, అమిలు ఇచ్చి, ప్రజలను మోసం చేసి, తెలంగాణ రైతంగాన్ని, ప్రజల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుంది అని, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తెలిపారు.రాష్ట్రం లో అరాచకాలు, ప్రజా పాలనా పేరుతో, ప్రజల సొమ్మును దోచుకోవడం తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచన కాంగ్రెస్ కు లేదు అని అన్నారు. కేసీఆర్ ప్రారంభించిన సంక్షేమ పథకలను ఆపేస్తూ,కట్టిన ఇల్లు, పెట్టిన పోయి లాగా, రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పగిస్తే, దాన్ని రేవంత్ రెడ్డి మరింత ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి, పూర్తిగా నాశనం చేశారు అని మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం పరిగి పట్టణం లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద బి ఆర్ ఎస్ నాయకులుతో కలిసి దండయాత్ర తీరుగా, నిరసన నిర్వహించిన బి ఆర్ ఎస్ నాయకులు ఇంకా మిగిలింది 2 ఏండ్లు అని గుర్తు చేస్తూ, కార్యకర్తలు అందరు దైర్యంగా ఉండాలని, పార్టీ కోసం పని చేయాలనీ, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ లను, 420 హామీలను ప్రజలకు వివరించాలని, పార్టీ నాయకుల కు, కార్యకర్తలకు పిలుపును ఇచ్చిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి,