
జనం న్యూస్ సెప్టెంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప గ్రామంలో 'మన ఊరు - మన జెండా' కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు కొరిపిల్ల వెంకట నాగ స్రవంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ప్రజామన్ననలు పొందారని, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా పాలన సాగిస్తోందని తెలిపారు. ఏపీకి జీవనాడులైన అమరావతి, పోలవరం పనులు కేంద్ర సహకారంతో వేగంగా సాగుతున్నాయన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.మాజీ ఎమ్మెల్యే అయ్యాజి వేమా మాట్లాడుతూ వాకతిప్ప గ్రామాభివృద్ధికి కొరిపిల్ల వెంకట నాగ స్రవంతి చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నెక్కంటి బాలకృష్ణ, సాయిరామ్, కర్రి చిట్టిబాబు, పి.ఎస్.ఆర్. చౌదరి, మద్దుల సుబ్బారావు, యాళ్ల దొరబాబు, నామాల శ్రీనివాస్, పద్మావతి, తోరం రాము, చీకట్ల నారాయణమూర్తి, సుంకర చిన్న తదితరులు, పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.