జనం న్యూస్ తూప్రాన్ మే 3, తూప్రాన్ శివారులోని రామాలయం సమీపంలోని అతి పురాతనమైన స్వయంభుగా వెలసిన శ్రీ కూర్మనారసింహస్వామి జయంతి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. రెండు రోజులపాటు స్వామివారికి ప్రత్యేక పూజలు ఆంజనేయ స్వామి వారికి చందన విలేయపదం ఆకు పూజ మరియు ధ్వజారోహణం సుదర్శన హోమం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం ఓడి బియ్యం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వాహకులు దేవాలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. అన్నప్రసాద కార్యక్రమాన్ని బజారు రూపేష్ అందించారు, నిర్వాహకులు కంటాయపాలెం వేణుగోపాల్ ఆలయ పురోహితులు అహోబిలం ప్రవీణ్ , తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ కొక్కొండ సమతా కాశిరెడ్డి, కౌన్సిలర్లు సబిత నాగేష్ ముదిరాజ్, బొడ్డు జోత్స్న వేణు, మాజీ మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ, మాజీ శివంపేట ఎంపీపీ కల్లూరు హరికృష్ణ, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొల్లంపల్లి బాబుల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు మామిడి వెంకటేష్, శ్రీశైలం గౌడ్, సీనియర్ పాత్రికేయులు జానకిరామ్ గౌడ్, నాగుల వేణుగోపాల్ గౌడ్, బిజెపి నాయకులు తాటి విట్టల్ మహేష్ గౌడ్ సంఖ్య యాదగిరి సాయి బాబా గౌడ్, శ్రీ వైష్ణవ సంగం సభ్యులు శ్రీ చూర్ణం విద్యాసాగర్ తిరునగరి డాక్టర్ ప్రదీప్ సింహ సుధాకర్, విష్ణు ,శ్రీధర్ ,రాము పాల్గొన్నారు.