జనం న్యూస్ జూన్ 01 ప్రతినిది ఎండీ జహంగీర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా మంగళ వారం నాడు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనం102 గది లో నిర్వహించిన కంటి చికిత్స శిబిరం విజయవంతమైనట్లు నాగర్ కర్నూల్ ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు.ఈ శిబిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 88మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో అర్హులైన క్యాటరాక్ట్ పొరగల 38మందిని గుర్తించి ప్రత్యేక అంబులెన్స్ లో లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రికి పంపినట్లు ఆయన తెలిపారు. రోగులకు శిబిరం లో ప్రత్యేక కంటి పరీక్షలు నిర్వహించి పలు సూచనలు,మందులు అందజేశారు. ప్రతి ఒక్కరు జీవితకాలము కంటిచూపును కలిగి ఉండుటకు ప్రతి రోజు నిత్య భోజనంలో విటమిన్- ఏ,కూడిన క్యారెట్,ఆకుకూరలు,చేపలు, ఆహార పదార్థాలు అధిక మొత్తంలో తినాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ పారామెడికల్ అధికారి పి. సుకుమార్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ ఓరుగంటి. శ్రీనివాస్ , ఆర్ బి ఎస్ కే వైద్యులు డా.సురేష్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.