జనం న్యూస్ 26 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లాలోని 5 సం,,లోపు చిన్నారులే లక్ష్యం. పోలియో రహిత సమాజంగ మార్చేందుకు ప్రతిష్టాత్మకంగ నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం-2026 జూన్ 28-06-2026 ఆదివారం రోజున జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జె. సంధ్యా కిరణ్మయి నేతృత్వంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అదికారి డా మొహమ్మద్ అస్గర్ అలీ ప్రత్యక్ష పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. జిల్లా లక్ష్యం - కార్యాచరణ వివరాలు జిల్లాలో 0-5 సంవత్సరాల లోపు 69,383 మంది చిన్నారులను గుర్తించడం జరిగింది. లక్ష్యం వీరందరికి 100% పోలియో చుక్కలు వేయడం. హైరిస్క్ ప్రాంతాలు: జిల్లాలో 53 హైరిస్క్ ఏరియాలు గుర్తించడం జరిగింది వాటిపై ప్రత్యేక దృష్టి వలస కూలీలు ఇటుక బట్టీలు,కోళ్ల ఫారాలు, నిర్మాణ రంగ కార్మికుల పిల్లలు యే ఒక్కరు కూడ తప్పిపోకుండ ప్రత్యోక్కరిని గుర్తించి ఉదృతంగ పోలియో చుక్కలు వేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. బూత్ డే & హౌస్ టు హౌస్: 28-05-2026 ఆదివారం రోజున బూత్ స్థాయిలో పోలియో చుక్కలు వెయడానికి జిల్లా వ్యాప్తంగ 471 పోలియో బూత్‌లు ఇందుకోసం ఆసుపత్రులు, అంగన్వాడి కెంద్రాలు, గ్రామపంచాయతీలు, బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక బూత్ లు ఏర్పాటు చేయడం జరిగింది . ప్రతి బూత్‌లో నలుగురు చొప్పున మొత్తం 1,884 మంది సిబ్బందిని కేటాయించడం జరిగింది వారందరు ఆది, సోమ, మంగళ వారాలలో ఈ మూడు రోజుల పాటు ఉ,, 7:00 గం,,ల నుండి సా,, 5:00 గం,,ల వరకు చుక్కల మందు వేయడం జరుగుతుంది. 29, 30వ తేదీలలో రెండు రోజుల పాటు గ్రామాలలో కలియ తిరుగుతు మొత్తం జిల్లాలోని 1,38,219 ఇళ్లను ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి బూత్‌కు రాని పిల్లలను గుర్తించి ఇంటి వద్దనే చుక్కలు వేస్తారు. అర్ధరాత్రి నుంచే ప్రారంభం: 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్‌లలో ట్రాన్సిట్ టీమ్‌లు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ప్రారంభిస్తాయి. పర్యవేక్షణ: కార్యక్రమ పర్యవేక్షణకు 45 మంది సెక్టార్ సూపర్‌వైజర్లు నియమించడం జరిగింది… జిల్లా నోడల్ అధికారులుగ: డా, మొహమ్మద్ అజ్గర్ అలీ జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి. డా, రామచంద్రరావు యన్ సి డి ప్రోగ్రాం అధికారి. డా, జి. రాజు టి.బి & లెప్రసి ప్రోగ్రాం అధికారి. డా. ప్రసూనరాణి యం హెచ్ ఎన్ ప్రోగ్రాం అధికారి.వీరందరు నిరంతర పర్యవేక్షణ చేస్తారు. బి ఎం హెచ్ ఓ విజ్ఞప్తి పోలియో నిర్మూలన మనందరి సామాజిక బాధ్యత. 0-5 ఏళ్ల పిల్లలు యే ఒక్కరు కూడ చుక్కలు వేయించుకోకుండ మిగిలిపోకూడదు. ప్రజా ప్రతినిధులు,మండల స్థాయి అధికారులు స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజా ప్రతినిధుల సమక్షములో ఆదివారం రోజున ఉ,, 7:00 గం,,లకు కార్యక్రమం ప్రారంభోత్సవం చేయాలని జిల్లాలోని అన్ని మండలాల పి హెచ్ సి ల వైద్యాధికారులకు మరియు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఎం ఎల్ హెచ్ పి లకు ఆదేశాలు జారి చేయడం జరిగింది.పోలియో మందు వలన ఎలాంటి దుష్ప్రభావాలు కాని ఎలాంటి ప్రతికూల సంఘటనలు కాని జరగవు అనాలోచిత ప్రభావాలను నమ్మకుండ అప్పుడే పుట్టిన పసికందు నుంచి 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికి నిర్భయంగ పిల్లల తల్లిదండ్రులు తమ భాద్యతగ భావించి పిల్లలు అంగవైకల్యానికి గురి కాకుండ…నిండు నూరేళ్ల జీవితానికి రెండు చుక్కల పోలియో మందు వేయించి వారి జీవితానికి బంగారు బాట వేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పిలుపునిచ్చారు పోలియో చుక్కలు పుట్టిన రోజు కాని నిరంతర వ్యాది నిరోదక టీకాల కార్యక్రమములో కాని మరియు ఇంతకు మునుపు ఎప్పుడైన,ఎక్కాడైన వేసిన వేయించిన పిల్లకందరికి కూడ మరో సారి ఈ కార్యక్రమములో ఎలాంటి సందేహము లేకుండ నిర్భయంగ పోలియో చుక్కలు వేయించాలి. పోలియో చుక్కలు ఎలాంటి పిల్లలకు మరియు ఎవరికి వెయరాదు తీవ్రమైన జ్వరము, వాంతులు, విరెచనాలు, దగ్గు జలుబు ఉపిరిఆడకపొవడం, మూర్ఛ వ్యాది గ్రస్థూలకు మరియు ఏ వ్యాదితోనైన ప్రస్తుతం చికిత్స పొందుతున్న పిల్లకు పోలియో చుక్కలు వెయరాదు, వెయించరాదు. ఇట్టి బ్రహుత్తరమైన కార్యక్రమం విజయవంతం చేయడానికి ఎలాంటి ఆవాంచనియ సంఘటనాలు జరుగకుండ అన్ని శాఖాల జిల్లా స్థాయి మరియు మండలస్థాయి అదికారులు, ప్రజాప్రతినిదులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పత్రిక విలేకరులు మరియు ప్రజలందరు కార్యక్రమంలో పాల్గొని తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరనైనది.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జోగుళాంబ గద్వాల జిల్లా