అయిజ పి యచ్చ్ సి లో డాక్టర్స్ కు సన్మానం

జనం న్యూస్ 01 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అనతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పి యచ్చ్ సి నందు డాక్టర్స్ మరియు ఎయన్ యం లకు సన్మానం చేసి వారు మాట్లాడుతూ వైద్యో నారాయనో హరి అని వైద్యుడు దేవుని తో సమానమని ముఖ్యంగా కరోనా విపత్తు సమయంలో ప్రాణాలు కుటుంబం లెక్క చేయకుండా ప్రజలకు వైద్యం చేస్తూ చాలా మంది వైద్యులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అని అదేవిధంగా వారు 24 గంటలు అందుబాటులో ఉంటారని ముఖ్యంగా కరోనా సమయంలో ఎ యన్ యం లు ఆశా వర్కర్లు ఇంటి ఇంటికి తిరిగి మందులు ఇచ్చే సమయం లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని కాబట్టి ప్రతి ఒక్కరూ డాక్టర్స్ మరియు ఎ యన్ యం లు ఆశా వర్కర్ల కు సంతాపం తెలియజేయాలి మరియు జూలై 1 వ తేదీ న డాక్టర్స్ డే సందర్భంగా వీలైన చోట మీకు సమీపంలో ఉన్న డాక్టర్స్ మరియ సిబ్బంది ని సన్మానం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ అయిజ పట్టణ మండల అధ్యక్షులు తెలుగు నర్సింహా గోపాలకృష్ణ నాయకులు లక్షణ్ గౌడ్ భీమన్న ఖుషీ నేత్రా దేశు తదితరులు పాల్గొన్నారు.