అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం

★పీఎంకే ఫౌండేషన్ మానవతా సేవలు

జనం న్యూస్, మే 2(జిల్లా ఇంచార్జ్ ) జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన బండారి లచ్చమ్మ అనారోగ్యంతో మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో కీర్తిశేషులు పల్లె మొగిలయ్య–కనుకమ్మ పేరుతో నిర్వహిస్తున్న పీఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సహాయం పీఎంకే అధినేత పల్లె ప్రభాకర్–సుజాత గౌడ్ దంపతుల చొరవతో అందించబడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో సహాయం అందించి మానవతా విలువలను చాటుతున్న పీఎంకే సంస్థ సేవలను గ్రామ ప్రజలు అభినందించారు.ఈకార్యక్రమంలో పల్లె రవి కుమార్, యాదవ సంఘము ప్రెసిడెంట్ సతీష్ కుమార్, రాజయ్య,విరస్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.