అంగన్వాడీ టీచర్ రిటైర్మెంట్ ఘనంగ నిర్వహించిన

★గుడిపల్లి సర్పంచ్ కూన్ రెడ్డి రాజశేఖరరెడ్డి.

జనం న్యూస్ ప్రతినిధి శ్రీరమణ మే 1 తేదీన 2026 పీ.ఏ.పల్లి మండలం నల్గొండ జిల్లా న్యూస్ . గుడిపల్లి మండలం పరిధిలోని భీమనపల్లీ అంగన్వాడీ టీచర్ అన్నపూర్ణమ్మ, మాదాపురం అంగన్వాడీ టీచర్ బుచ్చమ్మ 1983 లో ఉద్యోగం లో జాయిన్ అయ్యి ఈ రోజు తో పదవి విరమణ పొందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గుడిపల్లి సర్పంచ్ కూన్ రెడ్డి రాజశేఖరరెడ్డి వారికి ఘనంగా సన్మానం చేశాడు. ఈ కార్యక్రమంలో సి డి పి వో, అంగన్వాడీ సూపర్వైజర్, సర్పంచ్ కూన్ రెడ్డి రాజశేఖరరెడ్డి, మాజీ పీ ఎ సి ఎస్ చైర్మన్ ఎలుగు రివల్లపూ రెడ్డి, పరమేష్, ఉప సర్పంచ్ అర్వపల్లి శ్రీనయ్య, మండల అంగన్వాడీ టీచర్స్ పాల్గొని వారు చేసిన సేవలను గుర్తు చేస్తూ ఘనంగా సన్మానించారు.